Pawan kalyan: గిరిజన యువతకు పర్యాటక రంగంలో ఉపాధి కల్పిస్తాం 2 d ago
AP : గిరిజన యువతకు ఉపాధి, తాగునీరు, రోడ్లు లేవని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అటవీ ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంటుందన్నారు. వెనుకబడ్డ ప్రాంతాల కోసం రూ.670 కోట్లు వస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. రుషికొండకు రూ. 500 కోట్లు ఖర్చు పెట్టారు.. ఇక్కడ రూ. 9 కోట్లతో రోడ్లు వేయలేకపోయారని విమర్శించారు. గిరిజన యువతకు పర్యాటక రంగంలో ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి 2 నెలల్లో మూడు రోజులు మన్యంలో పర్యటిస్తానని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.